జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం పోరాట ఫలితంతో దిగివచ్చిన ప్రభుత్వం

తెలంగాణ, ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై గత వారం రోజుల నుంచి తీవ్ర గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. మనస్తాపంతో విద్యార్ధుల మరణాలు ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ. పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి… ఈ సారి పాస్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకి అండగా నిలిచిన జనసేన విద్యార్థి విభాగం(ఝ్శ్వ్)… ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగడంలో జనసేన విద్యార్ధి విభాగం(ఝ్శ్వ్) ఎంతో ముఖ్యపాత్ర పోషించింది అని చెప్పవచ్చు… రానున్న రోజుల్లో విద్యార్థుల తరపున పోరాటం చేయడానికి ఎపుడూ సిద్ధమే అని, నవ సమాజ నిర్మాణం కోసం ఎటువంటి పోరాటానికైన సిద్దమని జనసేన విద్యార్థి విభాగం తెలిపింది.