నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

చండ్రగూడెం: జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో తుఫాను కారణంగా వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు స్థాపించారు కానీ? పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. తక్షణమే రైతులకు పంట నష్టం అంచనా వేసి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మైలవరం మండలం క్లస్టర్ ఇంచార్జ్ మోర్ల వెంకట రోశాలు మాట్లాడుతూ తుఫాను ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా కానీ! కనీసం రైతుల కష్టసుఖాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంకి వెంకటేశ్వరరావు, కాలంగి రవి, తాతా శ్రీనివాసరావు(ఎస్ఐ), తెనాలి సూర్యనారాయణ, పరసా రాంబాబు, రాజులపాటి గోపి, కడియం వెంకటేశ్వరరావు, రాయుడు శ్రీనివాసరావు, కొండూరు నవీన్, జాజుల రాము, నక్కనబోయిన నాగరాజు, జనసేన నాయకులు ఏ. శివరాం ప్రసాద్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన్న రామారావు, మల్లారపు దుర్గాప్రసాద్, మర్రి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.