జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన

గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం, కరిచర్లగూడెం గ్రామ జనసైనికుడు రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి.. కొంత మొత్తం ఆర్థికసాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోపాలపురం మండల అధ్యక్షులు పోల్నాటి రాజేంద్ర మాట్లాడుతూ.. మేము రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని.. వారి పిల్లలను చూసుకుంటాం అని బరోసానిచ్చారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల అధ్యక్షులు పోల్నాటి రాజేంద్ర, దొండపూడి గ్రామ అధ్యక్షులు ఎస్.కే. బద్రి, పోసిన గణపతి, బండారు లక్ష్మణ్, మున్నా, వంగా గోపి, కరిచెర్లగూడెం గ్రామ జనసైనికులు పాల్గొని రామకృష్ణకు నివాళులు అర్పించడం జరిగింది.