చలివేంద్రి గ్రామంలో జనం వద్దకు జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, చలివేంద్రి గ్రామం బి.సి కాలనిలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం ఇంటి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి మహిళకు, యువతకు, పెద్దలకు, తెలియజేస్తూ.. జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారని.. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్ను కోవాల్సిన అవసరం ఉందని మత్స.పుండరీకం అన్నారు. జనసేన పార్టీని గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే.. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని ప్రజలను కోరారు. జనం వద్దకు జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రతి జనసైనికుడు మీ మీ గ్రామంలో రోజుకి ఒక గంట – ప్రజలకు జనసేన పార్టీ గురించి తెలియజేయండి అని జనసైనికులకు మత్స.పుండరీకం కోరారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రి గ్రామ జనసైనికులు దత్తి గోపాలకృష్ణ, బొత్స సింహచలం, బొత్స శ్రీనివాస రావు, గర్బన రాంబాబు, కర్ణేన పవన్ సాయి, బి.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.