థర్మల్ దీక్షకు జనసేన కణితి కిరణ్ మద్దతు

టెక్కలి, సంతబొమ్మాలి మండలం వడ్డీతాండ్ర గ్రామంలో థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమ కాలంలో తమపైన పెట్టిన కేసులను ఎత్తి వేయాలని మరియు జీవో నెంబర్ 1108 ను రద్దు చేయాలని గ్రామస్థులు చేస్తున్న దీక్షలు నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి గ్రామస్తులకు తన మద్దతు తెలియజేసారు. నాటి ప్రజాసంకల్ప యాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఇదే శిబిరాన్ని సందర్శించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 1108జీవోని మరియు ఉద్యమ కారులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తామని మాట ఇచ్చి నేటికి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆదిశగా ఏ చర్యలు తీసుకోలేదని కణితి కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇచ్చిన మాటను వెంటనే నిలుపైకోవలని… లేదంటే వచ్చేది పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ని జనసేన ప్రభుత్వమని, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే 1108 జీవోను, ఉద్యమ కారులపై కేసులను రద్దుచేసి తిరిగి తంపర నేలలపై వారికి పూర్తి సాగు హక్కులు కల్పిస్తామి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్నారెడ్డి, శ్రీను, అనంతు సింహాచలం, గణపతి, అబోతు వెంకటరమణ, కొత్తూరు హరి మరియు సంతబొమ్మలి జనసైనికులు పాల్గొన్నారు.