Araku: తేనెపుట్ గ్రామంలో పర్యటించిన జనసేన

అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ పరిధిలోగల తేనెపుట్ గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ అనంతగిరి మండల అడ్యక్షుడు చిట్టాం మురళి ఆధ్వర్యంలో తేనెపుట్ గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ బృందం అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనేడి లక్ష్మణ్ రావు డుంబ్రిగుడ మండల జెడ్పిటిసి అభ్యర్ది చిన్న బాబు కాలినడకన వాగులు వంకలు దాటుతూ పులుసు మామిడి గ్రామం నుండి తేనెపుట్ చేరుకుని గ్రామస్థులతో సమావేశమయ్యారు.

మాదాల శ్రీరాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ

👉తేనెపుట్ గ్రామం లో రోడ్డు లేదు అనంత గిరి నుండి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామం చేరుకోవాలి.
👉స్కూల్ బిల్డింగ్ లేదు చదువుకోవడానికి 2 కిలో మీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కొండలు దాటుకుంటూ దట్టమైన అడవిలో నుండి వెళ్లాలి.
👉మంచి నీటి సమస్య గ్రామంలో తీవ్రంగా ఉంది.
👉 అనారోగ్య సమస్య వస్తే డోలి మోత తప్ప వేరేమార్గం లేదు.
👉గ్రామ వాలంటీర్ గ్రామానికి రావడం లేదు.
👉పింఛన్ ఇవ్వడానికి కుడా గ్రామంలో రావడం లేదు 2 కిలోమీటర్ల దూరంలో పిలిపించి ఇస్తున్నారు.
👉 గ్రామంలో ప్రభుత్వం ఇచ్చన ఇందిరమ్మ ఇల్లు గాని NTR ఇల్లు గానీ ఒక్కటి కుడా లేదు కానీ గ్రామస్థుల అందరి పేర్లు మీద ఇల్లు ఉన్నాయి.
👉 గ్రామస్థుల పేర్లు మీద ఎవరు ఇల్లు కట్టించారో తెలియదు.
👉 కొండల్లో పండించిన జొన్న చేను చోడి పంట చేతికొచ్చే సమయంలో వర్షం రావడంతో తీవ్రంగా నష్టపోయారు.
👉పంటను పరిశీలించడం జరిగింది ప్రభుత్వమే ఆదుకోవాలి.
👉స్కూల్ కి దూరమైన పిల్లలు మాకు స్కూల్ కావాలని చెపుతున్నారు.

స్కూల్ బిల్డింగ్ లేదు చదువుకు దూరమైన పిల్లలకు వాలంటీర్ ఏర్పాటు చేయాలి గ్రామంలో రోడ్డు వెయ్యాలి.
పింఛన్ గ్రామంలోనె ఇవ్వాలి రేషన్ బియ్యం కుడా పులుసు మామిడిలో ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామస్థుల సమస్యలు తీర్చాలని ఈ సందర్భముగ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్న గిరిజన బ్రతుకులు మారడం లేదు అని ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన జనసెన పార్టీ నేత మాదాలా శ్రీరాములు కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.