అగ్ని ప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

వీరవాసరం మండలం దూసనపూడి గ్రామం ఎస్సి కాలనీలో చెదిపారుగుల వెంకట్రావు తాటాకు ఇల్లు పూర్తిగా దగ్నం అయ్యి కుటుంబమంతా నిరాశ్రయులయ్యారు విషయం తెలిసిన వెంటనే వీరవాసరం మండలం జడ్పిటిసి గుండా ప్రకాష్ నాయుడు వీరవాసరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రామకృష్ణ మండల పరిషత్ ఉపాధ్యక్షులు అడ్డాల రాము, గుండా బాబు, బృందావనం నాగేంద్ర, మొఖమట్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండా రామకృష్ణ మాట్లాడుతూ ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా జనసేన పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అన్నారు ఒక నెలకి సరిపడగా నిత్యావసర సరుకులు మంచం కూరగాయలు బట్టలు ఇవ్వడం జరిగింది.