మీనా, నాగరాజ్ ల కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేసేవరకూ పోరాడుతాం.. వెదురుకుప్పం జనసేన

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, మొండి వెంగనపల్లి పంచాయితీ, నెమలగుంట గ్రామంలో నిరసిస్తున్న ఎం. మీనా, నాగరాజుల కుటుంబంలో నలుగురు అంగవైకల్యనికి చెందినవారు.. నాగరాజ్ కి కళ్లు కనిపించవు.. అతనికి వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అవుతున్నది.. ఇల్లు లేక బాత్రూంలో నివసిస్తున్నారు.. ఇప్పుడు తన భార్య గర్భవతిగా ఉన్నది. ఇంతవరకు వీళ్లకు ఇల్లు శాంక్షన్ కాలేదు.. ఇదివరకే వీరు కలెక్టర్ ఆఫీస్ లో స్పందనకి అర్జీ ఇవ్వడం జరిగింది.. అర్జీ నెంబర్ CTR 2022052969.. కానీ ఇప్పటివరకూ వీరి కుటుంబానికి ఇల్లు శాంక్షన్ కాలేదు.. వీరికి తగిన న్యాయం జరగలేదు.. ఈ సమస్య బ్రహ్మనపల్లి వి.ఆర్.ఓ ధన శేఖర్ దృష్టికి తీసుకెళ్లినా దీనిపై ఎటువంటి స్పందనా లేదు.. దీనిపై జనసేన పార్టీ సోమవారం నాగరాజ్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. న్యాయం జరగని పక్షంలో.. మీనా, నాగరాజ్ ల కుటుంబానికి న్యాయం కోసం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట జనసేన పార్టీ తరఫున ధర్నా నిర్వహించబడును అని వెదురుకుప్పం మండలం జనసేన పార్టీ తరఫున తెలియచేయడం జరిగింది.