ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది: సంపత్ నాయక్

హైదరాబాద్, గత మూడు రోజులుగా మెడికల్ ప్రీతి కుటుంబానికి అండగా ఉన్న జనసేన పార్టీ. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసిన సంపత్ నాయక్. జనసేన విద్యార్థి విభాగం యొక్క ప్రధానమైన డిమాండ్ ప్రీతికి జరిగిన అన్యాయంలో ఎవరెవరైతే తన చావుకు కారకులయ్యారో ప్రిన్సిపాల్ ని, అదేవిధంగా హెచ్ఓడి, అదేవిధంగా సూపరింటెండెన్ట్ పైన చట్టరీత్యా కేసులు వేసి శిక్షించాలని జనసేన విద్యార్థి విభాగం కోరింది. ముఖ్యంగా ప్రీతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులకి వాళ్ళ తమ్మునికి గ్రూప్ వన్ స్థాయికి ఉద్యోగంతో పాటు ఐదు కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సైకో సైఫ్ తో పాటూ వీళ్ళను కూడా శిక్షించాలని జనసేన విద్యార్థి విభాగం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇటువంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు రావద్దని కోరుకున్నారు. ఇది ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి కాలేజీ యాజమాన్యం చేసిన హత్య అని అన్నారు.