జనసేనాని జన్మదినాన రెల్లిజనులకు అన్నదానం, వస్త్రదానం

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ మరియు రావాడ పంచాయతీలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం వడ్డాది శ్రీనువాస్, ఇజ్జిరొతు రమణ కుమార్తి, ఇజ్జిరొతు ఝాన్సీ రెల్లికులస్తులకు అన్నదానం మరియు వస్త్రదానం కార్యక్రమం చేయడం జరిగింది. కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు పిలుపు మేరకు ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గం రాష్ట్ర కోఆర్డినేటర్ సయ్యద్ విశ్వక్‌సేన్, రణస్థలం మండలం జనసేన అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి, గోర్లె సూర్య అప్పన్న, కె.బాలు, లింగాల సూరిబాబు మరియు జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు.