నడిపూడిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఆచంట నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను పురస్కరించుకుని నడిపూడి గ్రామ అధ్యక్షులు శీలం బాబీ భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య ఆధ్వర్యంలో నడిపూడిలో జనసేనని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో భాగంగా నడిపూడి స్వయంభు సుబ్రమణ్యస్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం, స్కూల్ పిల్లలకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ, నడిపూడి సెంటర్లో మొక్కల పంపిణీ, ఓసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘ పెద్దలచే కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది. మరియు జనసేన సిద్ధాంతాలు నచ్చి దానయ్య ఆధ్వర్యంలో 30 మంది నడిపూడి గ్రామ సభ్యులను కండువా కప్పిఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు మరియు గ్రామ సంఘ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.