కలికిరిండ్లలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ

  • పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వండి ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటారు
  • గాజు గ్లాస్ గుర్తుకు ఓటెయ్యండి ఉమ్మడి మేనిఫెస్టోను పగడ్బందీగా అమలు చేస్తాం
  • జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలంలో బుధవారం బండ్రేవు కాలనీ, కలికిరిండ్లలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తు గ్యారెంటీ అంశాలను ప్రతీ ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ స్వార్థం లేని, మకుటం లేని మహారాజు మూడు వేల మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు దారాళంగా పంచిపెట్టిన మహా వ్యక్తి, అభినవ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలోని ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటారని తెలిపారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటెయ్యండి, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ఎజెండాగా, సంక్షేమమే సంకల్పంగా, నిరుద్యోగులకు బాసటగా, ఉపాధి అవకాశాల బాటగా, వ్యవసాయానికి పెద్దపీటగా, కౌలు రైతులకు ఊరటగా, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అందే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా వివరించారు. రానున్న జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వార్థం లేని, సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధించాలని తపన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగర్ టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు చిరంజీవి, సూర్య నరసింహులు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ నరేష్, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురు గొప్ప మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు.