గాజువాకలో వైసిపి నుంచి జనసేన లోకి భారీ చేరికలు

గాజువాక నియోజకవర్గం: రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు మార్గం చూపగలిగే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని నమ్మి బుధవారం గాజువాక నియోజకవర్గం నుంచి వైసిపి పార్టి నచ్చి గాజువాక నియోజకవర్గం 70వ వార్డు వైసిపి అధ్యక్షులు కురిటి వెంకట సూరిబాబు, వారి అనుచరులు సుమారు 150 మంది పార్టీ పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో చేరారు. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నామని, వార్డులో ప్రజలకు ఉపయోగ పడే పనులు ఆశించిన స్థాయిలో చేయలేక పోయామని ఆవేదనతో వైసిపి పార్టీని వీడి జనసేనలో చేరామని సూరిబాబు అన్నారు. జనసేన పార్టీ విధి విధానాలు, ప్రజల సమస్యలపై పోరాడుతున్న తీరు, ప్రజల శ్రేయస్సు కోసం అండగా నిలబడుతున్న జనసేన పార్టీ లో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళి దేవి మాట్లాడుతూ గాజువాకలో జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, దీనికి సంకేతమే గాజువాక నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ గా ఉన్న వార్డు నుంచి జనసేన లోకి చేరికలని అన్నారు. కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని భావించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి ఉమ్మడి నాయకత్వానిక అధికారమివ్వాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారని, దాంట్లో భాగమే ఇతర పార్టీల నుంచి జనసేన తీర్థం తీసుకుంటున్నారని వీరికి పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చి గౌరవం ఇస్తామన్నారు. వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి, పార్టీ నాయుకులు కర్రి శ్రీకాంత్,సాయి తదితరులు సమక్షంలో చేరికలు జరిగాయి. జాయిన్ అయిన వారిలో ముఖ్యలు జి. గోవింద, వి. నర్సింగరావు, టి. అప్పారావు, జి. రాంబాబు, ఎస్ శ్రీను, ఎస్ చిరంజీవి, ఎస్ భవాని, అప్పారావు, ఉమా మహేశ్వర రావు, గిన్న బుజ్జి, డి సత్యనారావు, ఆర్ రమణ, సిహెచ్ జగదీష్, పి వినోద్ లున్నారు.