రోడ్డుని త్వరగా పునరుద్ధరించాలని జనసేన వినతిపత్రం

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం బాసూరు గ్రామ రహదారికి ఆనుకొని ఉన్న జంపరకోట గెడ్డ నీటి ప్రవాహం వల్ల రోడ్డు బాగా దెబ్బతిని రోడ్డు కృంగిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇదే రహదారిపై సుమారు 8 నుంచి 10 గ్రామాల ప్రజలు రోజూ ప్రయాణిస్తూ ఉంటారు, అనేక మంది విద్యార్థులు కళాశాలలకు వెళ్తూ వస్తూ ఉంటారు, ప్రమాదపు అంచుల్లో ఉండే ఈ రోడ్డును పట్టించుకునే నాధుడే లేక గురువారం పాలకొండ జనసేన పార్టీ నాయకులు చొరవతో రహదారులు మరియు భవన శాఖ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డుకి ప్రహరీ గోడ నిర్మించి వేగవంతంగా ఎటువంటి ప్రమాదం జరగక ముందే దాని నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా బాసూరు పద్మాపురం గ్రామాల మధ్య ఉన్న రహదారి చాలా అధ్వానంగా ఉండడం వల్ల మధ్యకాలంలో ఒక మూగ జీవి (ఆవు) చనిపోవడం కూడా జరిగింది. ఈ విషయంపై స్థానిక రహదారులు మరియు భవనాల శాఖ డిఈ సానుకూలంగా స్పందిస్తూ త్వరితంగా దీన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి ఈ సమస్యను సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ నాయకులు వారాడ శ్రీను మత్స్య పుండరీకం, పోరెడ్డి ప్రశాంత్, జనసేన జానీ, పొట్నూరు రమేష్, జామి అనిల్ తదితరులు పాల్గొన్నారు.