విద్యా ప్రోత్సాహానికి జనసేన ప్రాధాన్యత

  • దాతల ఔదార్యాన్ని అభినందించిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం పట్టణం: విద్యలో ప్రోత్సాహం అందించేందుకుగాను జనసేన పార్టీ తొలి ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ కోరుకునే వారిలో జనసేన పార్టీ ముందుంటుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి పేర్కొన్నారు. పిఠాపురంలో విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 50 మంది విద్యార్థినీ, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్ కిట్ శేషు కుమారి చేతులు మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా శేషు కుమారి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయంగా పుస్తకాలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన స్పాన్సర్స్ పిండి శ్రీనివాస్, పి ఎస్ ఎన్ మూర్తి, పిండి గోవింద్ లను అభినందించారు. విద్య యొక్క ప్రాముఖ్యత, ఔన్నత్యం తెలిసినవారే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. దాతల స్ఫూర్తితో విద్యార్ధినీ, విద్యార్థులు విద్యలో రాణించి మంచి ఫలితాలు సాధించాలని, తల్లి తండ్రులకు, పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అభిలాషించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్, మేళం రామకృష్ణ, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, పిఠాపురం జనసేన టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా దుర్గ, గొల్లప్రోలు టౌన్ జనసేన ప్రెసిడెంట్ శిరీష, గొల్లప్రోలు మండల మహిళా ప్రెసిడెంట్ వినకొండ అమ్మాజీ, జనసైనికులు, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.