విజయనగరం ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండలాధ్యక్షుల ఆత్మీయ సమావేశం

విజయనగరం, ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశమవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు, చేస్తున్న కార్యక్రమాలు మరియు చేయబోతున్న కార్యక్రమాలు ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. మరియు డేటా కలెక్షన్, మండల అధ్యక్షలను & జిల్లా కో ఆర్డినేటర్స్ ను సమన్వయ పరచడం ఇలాంటి కార్యక్రమం ఇదివరకు ఎవరో సాహసించలేదని అన్ని విధాలా తమ శక్తి యొక్క మేర సహకరించుకొని పార్టీ పురోగతికి తోడ్పడుతూ మంచి ప్రయత్నమని ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని ఇలాంటి మంచి ఆలోచనలకు తెరలేపి అన్ని విభాగాలను ఒక దగ్గర చేర్చి అవగాహన కల్పించి సమావేశం ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర రీజినల్ ఐటి కో-ఆర్డినేటర్ గేదెల సతీష్ కి మరియు సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి హృదయపూర్వక ధన్యవాదాలు ఐటీ వింగ్ తరుపున తెలియజేస్తున్నామని తెలిపారు.