సయ్యద్ రషీద్ ఆమరణ నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ సయ్యద్ రషీద్ కు, తెలంగాణ ఉద్యమకారులకి కొత్తగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేముల కార్తీక్ ఆదేశాల మేరకు జనసేన తరపున శుక్రవారం సంఘీభావం తెలియడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వంచ జనసేన పార్టీ నాయకులు బ్రహ్మం, రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు అందరికీ తగు గుర్తింపు ఇచ్చి వారికి ఆర్థికంగా, మరియు వారి డిమాండ్స్ పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసారు. ఈ ఆమరణ దీక్షలో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలు ముత్యాల బ్రహ్మం, రాంబాబు, దేవ గౌడ్, రాము, ప్రసాద్, పండు, గిరి, శ్రీను, మరియు తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.