జనసైనికులు త్వరగా కోలుకోవాలి: బత్తుల

రాజానగరం నియోజకవర్గం, ముక్కినాడ గ్రామానికి చెందిన మిత్తన శ్రీను కుమారుడు, జనసైనికుడు బాలాజీ మరికొంతమంది జనసైనికులతో కలిసి జొన్నాడ గ్రామం నుండి కారులో మంగళవారం మచిలీ పట్నంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభకి వెళ్తూ ఉండగా.. దురదృష్టవశాత్తు రోడ్డుపై గేదె అడ్డు వచ్చి, కార్ అదుపు తప్పి పక్క పొలాల లోకి వెళ్లి కార్ పడిపోయింది. దీని కారణంగా బాలాజీకి తలకి గట్టిగా, మరో జొన్నాడ జనసైనికుడికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. ఆ రోజు నుండి వారు విజయవాడలో కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందారు. శుక్రవారం రాజనగరం జి.ఎస్.ఎల్ హాస్పిటల్ లో ఇరువురిని జాయిన్ చేయడం జరిగింది. విషయం ముక్కినాడ సీనియర్ నేత కవల శ్రీరామ్ ద్వారా తెలుసుకున్న “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హుటాహుటిన జిఎస్ఎల్ హాస్పిటల్ కి వెళ్లి.. ప్రమాద బాధితులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, హాస్పటల్ ఉన్నతాధికారులను, వైద్యులను సంప్రదించి, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ.. తీవ్రంగా గాయపడిన బాలాజీ కుటుంబానికి తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా, పూర్తిగా వైద్యం పూర్తయిన తర్వాత మరికొంత సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. జనసేన నేతలు, జనసైనికులు ఈమె వెంట ఉన్నారు.