ప్రజల తరపున జనసేన పోరాటం: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం రామచంద్ర పేట గ్రామంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నేతల బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి, రాము అనే రామచంద్ర పేట గ్రామానికి చెందినటువంటి యువకుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చేసినటువంటి కబ్జాలని బయటపెట్టాడున్న నెపంతో అతన్ని గత సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు, రాము అనే యువకుడు ఆ గ్రామంలో పనికి ఆహార పథకంలో భాగంగా ఆ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు, లోకల్ గా ఉన్న కొంతమంది అధికార వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఆ గ్రామానికి చెందినటువంటి ఒక చెరువును ఆక్రమించారు అని తెలుసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ రాము వారి కుట్ర కుతంత్రాలను ప్రజల ముందు పెట్టారు ఇది జీర్ణించుకోలేని ఆ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అతన్ని ఆ పదవి నుండి శాశ్వతంగా తొలగించారు అతనిపై ఆరోజు నుండి ఈరోజు వరకు వారిని వారి కుటుంబ సభ్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, ఆరోజు నుండి ఆ రామచంద్ర పేట గ్రామానికి పనికాహార పథకం నిలిపివేశారు దానితో ఉపాధి లేక ఆ ఊరి జనం దిక్కుతోచని పరిస్థితిలో మిగిలిపోయారు, అయితే ఆ గ్రామానికి చెందినటువంటి యువకుడు రాము జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై రణస్థలం యువశక్తి సభనందు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో చేరారు, అప్పటినుండి రాము ఆ ఊరి సమస్యలపై పోరాడుతూ పనికహార పథకం మొదలు పెట్టాలని ఆ ఊరి పార్టీ నాయకులను కోరడం జరిగింది. చివరికి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి పెద్ద అయిన ఆదిబాబు కాళ్లు పట్టుకొని తమ ఊరి ప్రజలకు పనికాహారం పథకం మొదలుపెట్టాలని వేడుకున్నాడు, ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి సంబంధిత అధికారులని కలసి పనికాహార పథకాన్ని తిరిగి ప్రారంభించేలా చేశారు. అయితే ఆ పని కొండ ప్రాంతంలో పెట్టారు, వయసు పైబడినవారు అక్కడికి చేరుకోడానికి ఎంతో నరకయాతన పడుతున్నారు, అయితే ఇంతకముందు చేస్తున్న ప్రదేశానికి తరలించేలా జనసేన పోరాడుతున్నది అని లోకం మాధవి వారికి హామీ ఇచ్చారు, ఈ ఉపాధి దొరకడం జనసేన విజయంగా భావిస్తున్నాం అని తెలియజేసారు.