ప్రజల హక్కుల కోసం జనసైనికులం సవాల్ చేస్తాం – సమాజం కోసం జనసేన పార్టీ తరపున లడాయి చేస్తాం

  • జనసేన ఛలో నెల్లూరు కలెక్టరేట్
  • ఇసుక అవినీతి గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
  • గునుకుల కిషోర్ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.

నెల్లూరు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోనే 110 ఇసుక రీచులను తవ్వకం నిలిపివేయాల్సి ఉండగా మినగల్లు గ్రామంలోని భారీ యంత్రాలతో నది నుంచి దారి వేసుకొని 40 అడుగుల మీద అక్రమ తవ్వకాలని జనసేన పార్టీ తరఫున ప్రశ్నించినందుకు గాను జనసేన నాయకులు మీద కేసులు కట్టడాన్ని నిరసిస్తూ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలని నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ని ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని సుప్రీంకోర్టు ఆర్డరు ఉన్నందున వాటిని నిలిపివేయాలని, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మా నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. ఈ సందర్భంగా గురుకుల కిషోర్ మాట్లాడుతూ…. గ్రామస్తుల నోళ్లు నొక్కి, అధికారుల కళ్ళు కప్పి, సుప్రీంకోర్టు మాటలు చెవున పెట్టక దోచుకు తింటుందీ వైసిపి ప్రభుత్వం. గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని 110 రీచ్ లలో భారీ యంత్రాలతో తవ్వరాదని తదుపరి తీర్పు వరకు వాటిని నిలిపివేయాలని చెవిన పెట్టక ఇష్టారీతిన ఇసుకను తవ్వి రాష్ట్రాన్ని దాటిస్తున్నారు. అక్రమంగా సంపాదించు కుంటున్నారు. గతంలో బందిపోటు దొంగలను చూసి భయపడే వాళ్ళం రాజకీయ నాయకులు చూస్తే గౌరవించే వాళ్ళం, సేవ చేస్తారని ఈరోజు వైసిపి నాయకులు బందిపోట్లుగా వ్యవహరిస్తూ సహజ సంపదను దోచేస్తున్నారు. వారిది బందిపోటు పార్టీ అనవచ్చు. ఈ వైసీపీ నాయకులు దెబ్బకి పల్లెలు దద్దరిల్లుతున్నాయి. గ్రామ సంపాదను అంతా దారి మళ్ళించి గ్రామానికి కనీసం నిధులు సమకూర్చక మౌళిక వసతులైన రోడ్లు, నీరు, వైద్యం కూడా కల్పించక దోచుకు తింటున్నారు వైసీపీ నాయకులు. అదేమిటిని ప్రశ్నిస్తే మా మీద కేసులు కడుతున్నారు. ఇసుక రీచ్ లో దాదాపు పది ప్రొక్లైన్లు, 30 లారీలు, 100 మంది జనాభా ఉండగా మేము ఒక 20 మందిని వాళ్ళ మీద దౌర్జన్యం చేశామంటూ కేసులు పెట్టడం సమంజసం కాదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం అమానుషం. మా మీద పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పే మనుషులే ఉండరు. పల్లెల్లో చిన్నాచితకా ట్రాక్టర్ బండ్లకు ఇసుక దొరకడం లేదు. అదేమని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఇంతటితో వదిలేదిలేదు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగడతాం. మొన్న వరదలకి గ్రామ పులికట్టలు తెగి గ్రామాలు మునిగిపోతే కనీసం ఒక్క పూట భోజనం ప్యాకెట్ కూడా అందించలేని ఈ ప్రభుత్వం ఇలా దోచుకు పోతూంటే చూస్తూ ఊరుకుంటారా. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి ఈ అక్రమాలను చేస్తున్న వారిని వేడుక చూస్తున్న వారిని అందరికీ శిక్ష పడేవరకు కూడా మేము ఈ విషయాన్ని వదిలేది లేదు అని తెలిపారు. అయ్యో పాపం అనే సానుభూతితో మీరు వేసిన ఒకే ఒక ఓటు దొంగలను బందిపోట్లు చేసింది గ్రామాలలో సహజ సంపదను దోచుకు తింటుంది. మరలా ఇలాంటి పని చేయకండి. ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి జనసేన ను గెలిపించండి అనికోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నళిలిశెట్టి శ్రీధర్, రీజనల్ కో-ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, కె.ఎస్.ఎస్ జిల్లా అద్యక్షులు సుదా మాదవ్, కావలి నాయకులు పొబ్బా సాయి, వెంకట్, ఉదయగిరి నాయకులు దిలీప్, బండారు సత్యనారాయణ, సురేష్, జిల్లా కార్యదర్శి ప్రశాంత్, సుమంత్, షాజహాన్, ఖలీల్, బాలు, వర్షన్, శరవణ, హేమచంద్ర యాదవ్, వీరమహిళలు రేణుక, సిటీ కార్యదర్శి కృష్ణవేణి, రేవతి, భవాని, అమీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.