మన ఊరిలో జనవాణి.. చాపల కంచేరు గ్రామంలో లోకం మాధవి పర్యటన

నెల్లిమర్ల: జనసేన పార్టీ బలోపేతం మరియు ప్రజా సమస్యలపై పోరాటానికై నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రారంభించిన మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా గురువారం భోగాపురం మండలం, చాపల కంచేరు గ్రామంలో లోకం మాధవి పర్యటించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మాధవి ప్రతి ఇంట పర్యటిస్తూ అనేక సమస్యలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలలో ముఖ్యంగా తాగునీరుగా గుర్తించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలుగుదేశం మరియు ఇప్పటి ప్రభుత్వమే వైకాపా ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం త్రాగునీటి సమస్య తీర్చలేదని, ఊరికి వచ్చిన నిధులని వారి జేబులకి దండుకుంటున్నారు అని ఆ ఊరి ప్రజలు మొరపెట్టుకున్నారు. సమస్యను విన్న లోకం మాధవి వారి ఊరికి ఒక వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఊరి ప్రజలు ఎంతో సంతోషించారు, ఆ గ్రామంలో మరో సమస్య పనికాహార పథకాన్ని నిలిపివేయటం, ఆ గ్రామంలో ఎన్నో రోజులుగా ప్రభుత్వ భూమి లేదని, దానివలన పనికాహార పథకం నిలిపివేశారని ఊరిలో ప్రజలు పేర్కొన్నారు. కాలువలు ఉన్నాయి కానీ వాటిని వాడుకొని ఉపాధి కల్పించగా, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో ఆ పథకాన్ని పెట్టడం ఎంత మాత్రం సమంజసం అని ఆ గ్రామస్తులు ప్రశ్నించారు, ఆ ఊరిలో ఉన్న మరో సమస్య దోమల బెడద, గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వారు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలేదని, దాని వలన వారి పిల్లలకి డెంగ్యూ టైఫాయిడ్ మరియు చికెన్ గునియా లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు, ఆ ఊరిలో ఉన్న మరో సమస్య పారిశుధ్యం మరియు రోడ్డు ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నాయి, ఈ సమస్యలు మొత్తం విన్న లోకం మాధవి ఆ ఊరికి మరియు మా ఊరి ప్రజలకి తాము అండగా ఉంటామని ధైర్యాన్ని కల్పించారు.