జనవరి 27 చిన్నమ్మ విడుదల !

తమిళనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర ఖజగం పార్టీ లో కీలక సభ్యురాలిగా జయలలిత తర్వాత సి‌ఎం రేస్ లో ఉంది శశికళ. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల వలన ఆ పార్టీ నుండి బయటకు వచ్చి, ఆమె అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీని స్థాపించింది. ఆతర్వాత ఆమెపై అక్రమ ఆస్తుల కేస్ లో గత కొన్ని ఎండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తుంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడి పార్టీలు ఎప్పటికే తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీ కూడా ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉంది. తమ పార్టీ నాయకురాలు కర్నాటక జైలునందు శిక్ష అనుభవిస్తుంది. ఆమె యొక్క శిక్ష కాలం జనవరి 27 నాటికి పూర్తి అవ్వుతుంది. తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ముందుగానే విడుదలకు పెట్టుకున్న పిటిషన్ ను కర్నాటక జైలుశాఖ వర్గాలు పరిశీలనలో ఉంది. కానీ ఆమె త్వరలో విడుదలయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడంలేదు. 2021 జనవరి 27 నాటికి శిక్ష కాలం పూర్తి అవ్వుతుంది. కావున నిన్న మంగళవారం నాడు ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.

శశికళ ఆహ్వాన ఏర్పాటలను ఓ 65 చోట్ల బ్రహ్మరథం పట్టేలాగాఏర్పాట్లు చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 27 నుండి జైలు నుండి విడుదలై నేరుగా జయలలిత సమాది వద్దకు చేరుకొని అక్కడ ఆమెకు నివాళ్లు అర్పించి అటు నుండి ఆమె తన ఇంటికి వెళ్ళుతారని ఆ పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం. మరో 28 రోజుల్లో శశికళ బయటకు వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *