జయా Vs జయ

బాలీవుడ్ నటుల డ్రగ్స్ వ్యవహారంపై ఎంపీ జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పార్లమెంటులో బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయప్రద సమర్థించారు.

బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, మాదకద్రవ్యాల ఉచ్చు నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఇటీవల పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ‘డ్రగ్స్‌కు బానిసలైన నటులను, యువతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రవికిషన్‌కు నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం గళం విప్పి మన దేశ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని జయప్రద అభిప్రాయం వ్యక్తంచేస్తూ ఈ అంశంపై జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు’ అని జయప్రద మండిపడ్డారు.