జయమ్మ పంచాయతీ.. పోస్టర్‌ రిలీజ్ చేసిన చెర్రీ

బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతున్న సుమ గతంలో సినిమాల్లోనూ నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వెండితెరపై కనిపించనున్నారు. సుమ ప్రధానపాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు విజయ్ కుమార్ కాలివరపు దర్శకత్వం వహిస్తున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.

కాగా, ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు. రామ్ చరణ్ ఈ చిత్రం గురించి సుమను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరండీ అని రామ్ చరణ్ అడగ్గా, నేనేనండీ అంటూ సుమ జవాబిచ్చింది. ఆఁ… అంటూ రామ్ చరణ్ ఆశ్చర్యపోయారు. అనంతరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.