అనంతపురంలో జగనన్న కాలనీలను సందర్శించిన జయరాంరెడ్డి

అనంతపురం అర్బన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి, కొడిమి గ్రామం, ఆలమూరు గ్రామాలలోని జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది.

  • ఉప్పరపల్లి గ్రామ జగనన్న కాలనీల సందర్శన

అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజలకు ఉప్పరపల్లి దగ్గర అనంతపురం చెరువుకు ఆనుకొని జగనన్న గృహాలను కేటాయించారు. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి దగ్గర జగనన్న కాలనీని సందర్శించగా జగనన్న గొప్పలు చెప్పుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ కాలనీ నందు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 1,80,000 రూపాయలు డబ్బులు చాలక లబ్ధిదారులు లక్షల రూపాయల అప్పులు చేసి కొన్ని గృహాలను నిర్మించుకుంటున్నప్పటికీ రోడ్లు, నీటి సదుపాయం, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కల్పించలేక ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని, తేలికపాటి వర్షాలకి ఈ ప్రాంతమంతా వర్షం నీటితో మునిగిపోతా ఉంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ జగనన్న కాలనీలు కాదు? జగనన్న ఊర్లు అంటరి? కేంద్ర ప్రభుత్వం తన వంతు గృహ నిర్మాణానికి డబ్బు కేటాయించినప్పటికీ మీరు నేటి వరకు గృహాలను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తక్షణమే రాష్ట్ర ప్రజలకు వివరణ తెలియచేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, దేవరాయల విజయ్, భవాని నగర్ సాయి కిరణ్, కుంటిమద్ది గుజ్జల దుర్గాప్రసాద్, ప్రవీణ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • కొడిమి గ్రామ జగనన్న కాలనీల సందర్శన

అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజలకు 7000 గృహాలను కొడిమి గ్రామం నందు 120 ఎకరాల స్థల సేకరణ చేసి, ఎకరాకు 28 లక్షల రూపాయల చొప్పున వైసిపి పార్టీ నాయకులకు మాత్రమే డబ్బులు చెల్లించి మిగతా వారికి నేటి వరకు డబ్బులు చెల్లించలేదు. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి ఆధ్వర్యంలో కొడిమి గ్రామం నందు జగనన్న కాలనీని సందర్శించగా జగనన్న గొప్పలు చెప్పుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ కాలనీ నందు ఒక్క గృహం కూడా లబ్ధిదారులకి పూర్తిచేసి ఇవ్వలేదు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొప్పలు మాత్రం చెప్పుకుంటూ కాలం వెల్లబుచ్చుతా ఉన్నది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ జగనన్న కాలనీలు కాదు? జగనన్న ఊర్లు అంటిరి? కేంద్ర ప్రభుత్వం తన వంతు గృహ నిర్మాణానికి డబ్బు కేటాయించినప్పటికీ మీరు నేటి వరకు గృహాలను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తక్షణమే రాష్ట్ర ప్రజలకు వివరణ తెలియచేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, కొడిమి నారాయణస్వామి, రాచానిపల్లి వెంకటేష్, జాకీర్ కొట్టాల రమేష్, రామకృష్ణ, ముస్తఫా, దేవరాయల విజయ్, భవాని నగర్ సాయి కిరణ్, కుంటిమద్ది గుజ్జల దుర్గాప్రసాద్, ప్రవీణ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • చిన్మయ నగర్ జగనన్న కాలనీల సందర్శన

అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజలకు చిన్మయ నగర్ దగ్గర టిడ్కో ఇల్లు దుస్థితి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీల సందర్శనలో భాగంగా #FailureOfJaganannaColony అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి ఆధ్వర్యంలో చిన్మయ నగర్ దగ్గర టిడ్కో కాలనీని సందర్శించగా జగనన్న గొప్పలు చెప్పుకుంటున్న నాటి నుంచి నేటి వరకు ఈ కాలనీ నందు కనీసం ఒక్క గృహాన్ని కూడా లబ్ధిదారులకి పూర్తిచేసి ఇవ్వలేదు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొప్పలు మాత్రం చెప్పుకుంటూ కాలం వెల్లబుచ్చుతా ఉన్నది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ జగనన్న కాలనీలు కాదు? జగనన్న ఊర్లు అంటరి? కేంద్ర ప్రభుత్వం తన వంతు గృహ నిర్మాణానికి డబ్బు కేటాయించినప్పటికీ మీరు నేటి వరకు గృహాలను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తక్షణమే రాష్ట్ర ప్రజలకు వివరణ తెలియచేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, దేవరాయల విజయ్, భవాని నగర్ సాయి కిరణ్, కుంటిమద్ది గుజ్జల దుర్గాప్రసాద్, ప్రవీణ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.