JEE Main, NEET హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ లింక్

‌దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, మెడిక‌ల్ ప్రవేశ‌ ప‌రీక్షల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Main), నీట్‌ (NEET) పరీక్షలు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలిపిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల అడ్మిట్ కార్డుల (హాల్ టికెట్లు)ను సైతం విడుదల చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. ఈ విద్యా సంవత్సరం ఆలస్యమైనా విద్యార్థులకు నష్టం జరగకుండా కాలేజీలు తెరచి, క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల షెడ్యూల్ సిద్దం చేశారు.

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు జేఈఈ మెయిన్ పరీక్షలు, సెప్టెంబ‌ర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఐఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను షెడ్యూల్ చేశారు.

(JEE Main Admit Card 2020 download link)

నీట్ పరీక్షల హాట్ టికెట్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.. (NEET Admit Card 2020 download link)