ఆపదలో అదుకున్న జేరు పోతుల సనత్ కుమార్

తెలంగాణ, భూపాలపల్లి: భూపాలపల్లి మండలము, కమలపుర్ గ్రామాల్లో బీజేపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని చందుపట్ల కీర్తి రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించడానికి వెళ్లి తిరిగి వస్తున్నా క్రమంలో భూపాలపల్లి మెయిన్ రోడ్డు సన్ వాలి స్కూల్ దగ్గర అదుపుతప్పి డివైడర్ గుద్దుకొని కింద పడ్డ కార్మికుడిని చూసి అటువైపుగా వస్తున్న జనసేన సైనికుడు సనత్ కుమార్ మరియు వారి మిత్ర బృందం వాహనంలో హాస్పటల్ కు తీసుకెల్లడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి మెరుగైన చికిత్స అదించాలని డాక్టర్ ను సంప్రదించడం జరిగింది.