ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: తెల్ల దొరలను వణికించిన ఝాన్సీలక్ష్మి భాయి వీరత్వాన్ని ప్రతి మహిళా ఆదర్శంగా తీసుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఝాన్సీలక్ష్మీ బాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఝాన్సీలక్ష్మీ బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ రాణి ఝాన్సీలక్ష్మీ బాయి మాతృభూమి రక్షణ కోసం చేసిన పోరాటం స్ఫూర్తినివ్వాలని, ఆమె స్ఫూర్తిని వీరమహిళలు పుణికి పుచ్చుకోవాలన్నారు. జనసేన పక్షాన మహిళలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు.
ఝాన్సీలక్ష్మీ బాయి స్పూర్తితో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కాటం అశ్విని, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, ఏంటి రాజేష్, ఎల్ రవితేజ, పిడుగు సతీష్ , అడబాల వేంకటేష్ , ఎమ్.పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.