రాజాం జనసేన ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో అసమాన ధీశాలి, అపూర్వ యుద్దనిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు, స్వాతంత్ర్య సేనాని, ఝాన్సీరాణి లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో ఎన్ని రాజుతోపాటు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.