వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

శృంగవరపుకోట నియోజకవర్గం: భారత తొలి స్వాతంత్ర సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మిబాయి జయంతిని పురస్కరించుకొని శృంగవరపుకోట నియోజకవర్గం, లక్కవరపుకోట మండలం, దాసుల్లుపాలెం గ్రామానికి చెందిన వీరమహిళా విభాగంలో క్రియాశిలక పాత్ర పోషిస్తున్న సగుబిండి వెంకట లక్ష్మి తన నివాసం వద్ద అందరినీ పిలిచి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించటం జరిగింది.