జీవో నెంబర్ 2ను వెంటనే రద్దు చేయాలి

ఉమ్మడి గుంటూరు జిల్లా: జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి విడుదల చేసిన జీవో ఆర్టీ నెంబర్ 2ను రద్దు చేయాలని అంగన్వాడి టీచర్లు మరియు ఆయాలకు న్యాయం చేయాలని వారికి మద్దతుగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపుమేరకు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. న్యాయమైన కోరికలు తీర్చాలని అది ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వారి యొక్క కోర్కెలు తీర్చాలని, తీర్చలేని పరిస్థితిలో అంగన్వాడీలు అందరూ రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అధికార ప్రభుత్వం వారిని పిలిపించి చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కారం చూపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీలో ఎవరికి సీటు ఎక్కడ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో అని ఆలోచిస్తూ కాలయాపన చేస్తున్నాడు. అంగన్వాడీలపై వారి యొక్క కార్యాలయాలపై ప్రభుత్వమే దాడులు చేసిన ఘనత మన జగన్ రెడ్డి గారిది. అంగన్వాడీలు అడిగిన కోరికలు కుదరదు అని చెప్పి వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలి అని వారిపై జీవో. ఆర్ టి నెంబర్ 2 అనే దాన్ని తీసుకువచ్చారు. ఒక అసమర్థ సీఎం తీసుకువచ్చిన చీకటి జీవో ఇది దీనిని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలకు మద్దతుగా ఈ ఉద్యమాల్ని తీవ్రత చేస్తాము అని హెచ్చరిస్తున్నాం.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అంగన్వాడిలు గత 20 రోజులుగా మాకు న్యాయం చేయాలని నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సరి సమానంగా జీతాలు ఇస్తామని మాట ఇచ్చి మడమ తిప్పేసిన ఈ జగన్ రెడ్డి ఇంకేమి పరిపాల చేస్తావ్.. వారి న్యాయమైన కోరికలు అడిగినందుకు వారిపై మీ ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేపించారు. మీయొక్క పాలనలో అంగన్వాడి, ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ టీచర్లు ఎవరూ కూడా ప్రశాంతంగా జీవించడం లేదు వీరు అందరూ కూడా రోడ్లపైనే ఉంటున్నారు వీరు అందరూ మిమ్మల్ని గద్దించాలని ఎదురుచూస్తున్నారు. ఎస్మా చట్టాన్ని మీరు రద్దు చేయాలి లేనియెడల మా పార్టీ అంగన్వాడి ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపి ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా, నగర నాయకులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.