తిరుపతి జనసేనలో భారీ చేరికలు

తిరుపతి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి స్థానిక 12వ మరియు 3వ వార్డులో 50 మంది యువకులు, పెద్దలు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య జిల్లా కార్యదర్శి ఆనంద్, నగర ఉపాధ్యక్షులు కొండా రాజమోహన్, నాయకులు లోకేష్, శ్రీకాంత్, గణేష్ తిరుపతి నగర కమిటీ నాయకులు కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, జనసైనికులు మోహిత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.