పలు కుటుంబాలను పరామర్శించిన గాజువాక జనసేన నాయకులు

గాజువాక, 75 వ వార్డులో వివిధ గ్రామాలలో స్వర్గస్తులైనటువంటి వారు దుర్గవాని పాలెంలో స్వర్గీయ గంట్యాడ సత్యరావు, పెదగంట్యాడలో స్వర్గీయ చినపాన వెంకటస్వామి, పాత అయ్యపాలెంలో స్వర్గీయ గొందేసి అప్పాయమ్మ, పెద్దకర్మ కార్యక్రమంలో పిఏసి సభ్యులు మరియు గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోన చినప్పారావు, జనసేన పార్టీ నాయకులు అంజూర దీపక్, దాసరి జ్యోతి రెడ్డి, నీలాపు శ్రీనివాస్ రెడ్డి, కోన చంటి, దేవర ఆనంద్ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.