వైస్సార్సీపీ నుండి జనసేనలో చేరికలు

చిలకలూరిపేట నియోజకవర్గం: నాదెండ్ల మండలం, జంగాలపల్లి గ్రామంలో 25 కుటుంబాలు వైస్సార్సీపీ నుండి గ్రామ నాయకులు జాన్ సైదా, మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, జి డి నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. జాన్ సైదా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఏ ఒక్క పని చేయడం లేదని ప్రజలు పవన్ కళ్యాణ్ పాలన చూడాలని ఉందని కళ్యాణ్ మాత్రమే ఈ రాష్ట్రన్ని కాపాడగలడని అందుకే ప్రజలందరు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. పెంటేల బాలాజి మాట్లాడుతూ నియోజకవర్గం మంత్రి విడదల రజని ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని కుటుంబం అంతా ఇసుక, మైనింగ్, మధ్యం, మీద సంపాదించుకునే పనిలోనే ఉన్నారని, ఏ ఒక్క గ్రామంలో కూడా నిత్యావసరం అయినా తాగునిటీ వసతి సరిగా లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవటం లేదని, కక్ష పూరిత రాజకీయం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి డిపాజిట్ రావటం కూడా కష్టమేనని విమర్శలు చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ఎస్ ఆర్ శ్రీను, పెద్దింటి చంద్రశేఖర్, ముద్దా యోబు, అమరేశ్వరి, నెలటూరి సన్ని, సాయి, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు, మల్లా కోటి, మండల కార్యదర్శి సుబ్బారావు, నాదెండ్ల మండల నాయకులు హనుమంతరావు, సుబ్బయ్య, మరియు నాయకులకు కార్యకర్తలు పాల్గొన్నారు.