బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన అధినేత్ పవన్ కళ్యాన్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు బొమ్మిడి నాయకర్ ఆశయాలు నచ్చి లక్ష్మణేశ్వరం గ్రామ సర్పంచ్ తిరుమాని వెంకటరాజు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారికి నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.