గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో జనసేనలో చేరికలు

మదనపల్లి నియోజకవర్గం, కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో యువ నాయకులు షేక్ ఫాజీల్ మరియు ఆయన మిత్రుడు షారుఖ్ అధ్యక్షతన 50 మంది యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు ఆకర్షతులై హిందూ ముస్లిం యువత పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం అని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారి అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. త్వరలో అభ్యర్ధి ఖరారు అయిన తరువాత పూర్తిస్థాయిలో రామదాస్ అధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని యువకులు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ లు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు,రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, విజయ్ కుమార్, గంగులప్ప, మజ్యాల నవీన్ రాయల్, నారాయణ స్వామి, నరేష్, యాసిన్, ప్రవీణ్, మహేష్, హరీష్, సికండర్, రెడ్డి, సిద్దిక్, ఆఫ్రోజ్, తౌసిఫ్ మరియు వారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.