నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం లక్ష్మణేశ్వరం గ్రామం దేవుని తోటకు చెందిన కేత అశోక్, కొప్పినీడి సురేష్, కుమ్మరిపురుగు చంటి, వేండ్ర రాంబాబు, పెచ్చెట్టి వరప్రసాద్, బొక్కా ఆనంద్ మరియు వారి అనుచరులు దాదాపుగా 100 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, ఒడుగు ఏసు, ఇంటి మురళి, తిరుమాని రత్నం, తిరుమాని పూర్ణచంద్రరావు, మైలా నరసింహ రాజు, కొపనాతి నరసింహ స్వామి, పెమ్మాడి సుధాకర్, పెమ్మాడి కిరణ్ కుమార్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.