వరికూటి నాగరాజు సమక్షంలో జనసేనలో చేరికలు

ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, సి.ఎస్.పురం మండలం, గుంత్త చెన్నంపల్లె గ్రామస్తులు కనిగిరి నియోజకవర్గ సన్వయకర్త వరికూటి నాగరాజు సమక్షంలో జనసేన పార్టీ నాయకులు కొత్తా గిరిబాబు (అడ్వకేట్) ఆద్వర్యంలో దాదాపు నలబై కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. సి.యస్.పురం మండల పరిధిలోని గుంత్త చెన్నంపల్లె గ్రామంలో జనసేన పార్టీలో చేరినవారు కొత్తా బాలపీరయ్య (రిటైర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్), కొత్తా తిరుపతయ్య ( రిటైర్ సెంట్రల్ గవర్నమెంట్), కొత్తా పీరయ్య, కొత్తా తిరుమలకొండయ్య, కొత్తా తిరుమలయ్య (నడిపయ్య), కొత్తా గోపాల్, కొత్తా శీనివాసులు (వైసిపి పోలింగ్ ఎజెంట్), కొత్తా శ్రీనివాసులు, కొత్తా సుబ్బరాయుడు, కొత్తా నాగేశ్వరరావు, చింతలపూడి రఘురామయ్య, నారిశెట్టి బాస్కర్ రావు, మహిళలు కొత్తా గంగమ్మ, కొత్తా పద్మ, కొత్తా రత్తమ్మ, కొత్తా శారదమ్మ, గుర్రంకోండు సులోచన, కొత్తా రత్తమ్మ కుటుంబాల వారు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు మాట్లాడుతూ రాబోవు 40 రోజుల్లో వైసిపి ప్రభుత్వం ఓడిపోతుందని మన జనసేన టిడిపి కూటమి విజయం తథ్యమని ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అలాగే జనసేన టిడిపి కూటమి అభ్యర్థిని ఉగ్ర నరసింహారెడ్డి గెలుపునకు మన పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.పురం మండల అధ్యక్షులు జానపాటి రాజ, ఉల్లిపాయల సుబ్బారాయుడు, మురళి యాదవ్, పోర్ల రాంబాబు, ఉసా శ్రీను మరియు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.