బొలిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం, కోరుమిల్లి గ్రామం నుండి జనసేన పార్టీ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై, వైయస్సార్సీపి పార్టీకి చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు జనసేన పార్టీ లైజనింగ్ సభ్యులు లింగం శ్రీను ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం
తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురంలో జనసేన పల్లె పోరులో భాగంగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏ పల్లెకు వెళ్లినా త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, కలుషిత నీరు త్రాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇవన్నీ గాలికి వదిలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజల సొమ్ముతో సిద్ధమనే కార్యక్రమాల్ని చేస్తూ కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును నాశనం చేస్తున్నారని, సిద్ధం అనే కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బుతో రాష్ట్రంలో రహదారులు బాగుంటుందని మట్టి దోచుకుంటున్నారు సుఖ దోసుకుంటున్నారు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను కూడా తీస్తున్నారు అందుకే ప్రజల సిద్ధంగా ఉన్నారు. ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ప్రజల కష్టాలు తీరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.