Fujairah: యూఏఈ లో “గల్ఫ్ సేన జన సేన” ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు

జనంలోకి “గల్ఫ్ సేన జన సేన” కార్యక్రమంలో భాగంగా “గల్ఫ్ సేన జన సేన” ఫుజైరా కంట్రీ కో ఆర్డినేటర్ శ్రీ మోగెళ్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గల్ఫ్ దేశాలలో ఒకటైనటువంటి యుఏఈ లో ప్రాంతమైన ఫుజైరాలో శుక్రవారం పలువురు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు

ఈ కార్యక్రమంలో ఫుజైరా గల్ఫ్ జన సైనికులు సత్యనారాయణ, రవీంద్ర, యజువెందర్, అనిల్, సుధాకర్ మరియు యూఏఈ కంట్రీ కో ఆర్డినేటర్లు KDVS నారాయణ, అప్పాజీ, రంగ, త్రిమూర్తులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం గల్ఫ్ కంట్రీలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు నాయకులు తెలియచేశారు.