హూలికళ్ళు & విట్లంపల్లి గ్రామాల నుండి జనసేనలో చేరికలు

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం హూలికళ్ళు & విట్లంపల్లి గ్రామాల నుంచి 25 కుటుంబాలు జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా జనసేన పార్టీలోకి జాయిన్ అయిన జనసైనికులకి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం గురించి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేయాలో దిశానిర్దేశం చేసిన అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, షేక్ తార, వంశి, జాకీర్, శివ, లోకేష్, శ్రీనివాసులు, ధను, చరణ్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.