వినుత కోటతో జేఎస్పి గ్లోబల్ టీమ్ 15 వ జూమ్ సమావేశం

జేఎస్పి గ్లోబల్ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి మరియు అండ్ టీమ్ అధ్వర్యంలో ఆదివారం 25 దేశాల నుంచి వీర మహిళలని మరియు జనసైనికులను కలుపుకొంటూ 15 వ జూమ్ సమావేశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోటతో నిర్వహించారు. 2019 నుంచి రాయలసీమలో జనసేన తరుపున అనేక సమస్యల మీద పోరాడుతున్నాము అని వినుత కోట టీంతో పరిచయం చేసుకొన్నారు. మా పేరెంట్స్ టిడిపిలో ఉన్నారు, మా అత్తమామలు వైసిపిలో ఉన్నారు. కానీ మా భర్త మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నపుడు, ఒక సందర్భంలో అద్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు వీర మహిళలు ముందుకు రావాలి అని నన్ను అధినేత పవన్ కళ్యాణ్ ప్రోత్సహహించి నన్ను ముందుకు తీసుకువచ్చారు. అందుకు అధినేతకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను అని వినుత కోట అన్నారు. బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేస్తున్నామని, మా నియోజకవర్గంలో గ్రామ పరిధిలో వాట్సప్ గ్రూప్స్, టీంలు బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము అని అన్నారు. ఫేక్ వోట్లని తీసివెయ్యటం. కొత్త వోట్లు రిజిస్ట్రేషన్ చెయ్యటానికి టీమ్స్ ని పెట్టి చేస్తున్నాము అన్నారు. ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన అలయన్స్ కి మీ రెస్పాన్స్ ఏమి అంటారు ? అని అడగగా అధినేత చెప్పిన మాటలలకి కట్టుబడి ఉంటామని వారి సీఎంని చెయ్యటానికి మేము అందరం కట్టుబడి ముందుకు వెళ్తామని అన్న్నారు. అనంతరం ఆడ పిల్లలు మిస్ అయ్యారు అని రైజ్ చేసిన ప్రశ్నలకి రెస్పాన్స్ వచ్చిందా? అని అడగగా చిత్తూరు జిల్లాలోనే చాలా కేసులు చూస్తున్నామని, కాని వైస్సార్సీపీ ఏమి రెస్పాన్ ఇవ్వటం లేదని, పోలీస్ వ్యవస్థ కూడా వైస్సార్సీపీకి సపోర్టుగా ఉంది మేము సమస్యల మీద ముందుకు వెళ్దాం అంటే మన ప్రభుత్వం రావాలి వాటి అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అని అన్నారు. మీరు ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ఏమి చేస్తున్నారు ? అని ప్రశ్నిచ్ణగా నో మై కాన్స్టిత్యుఎన్సీ ద్వారా ప్రజల లోకి ముందుకి వెళ్తున్నాము అన్నారు. ఇటీవల మహిళా బిల్ వచ్చింది కదా దానిమీద మీ స్పందన ఏమి అంటారు ? అని ఆదగా జనసేన పార్టీలో, పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి మహిళలకి ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు. వీర మహిళ అనే నామకరణం చేసి మహిళలని ప్రోత్సహాహిస్తా ఉన్నారు. ప్రతి మహిళ మన హౌస్ లో ఉన్న మురికిని ఎలా అయితే క్లీన్ చేస్తారో అలానే ఏపిలో ఉన్న కరప్షన్ పాలిటిక్స్ ని తరిమి కొట్టే విధంగ ముందుకు వస్తున్నారు అని చెప్పారు. టీడీపీ అండ్ జనసేన అలయన్స్ లో టివి ఛానల్ లో పార్టీ గురించి మంచిగా చూపించటం లేదు అని వీర మహిళలు సలహా ఇచ్చారు. ఈ జూమ్ సమావేశంలో వివిధ దేశాల నుంచి వీర మహిళలు మరియు జనసైనికులు సురేష్ వరికూటి జర్మనీ, యూకే నుండి పద్మజ రామిశెట్టి, నాగరాజు వడ్రాణం, అమల చలమలశెట్టి, స్రవంతి జలకం, ఉమారాణి, జగదీష్ గాజుల, అశోక్ చెలికాని, బాల నల్లి, హిమవల్లి, శ్రీవదన, ఆస్ట్రేలియా నుండి హేమ నాయుడు, మహాలక్ష్మి, సత్య సాయిరాం సింగపూర్, సాయిరాం న్యూజిలాండ్, అప్పారావు పాపాలు యూఏఈ, కిషన్ కుమార్ టాంజానియా, ధర్మారావు పగడాల, రామకృష్ణ రావుల , కృష్ణ రాయల్, వినోద్ కుమార్, సోమయ్య ఆచంట, వీరు వీరూ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.