బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

*ప్రముఖ సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఓ మహాత్మా జ్యోతిరావు పూలే! మీకు కోటి దండాలు
*జనసేనాని.. మీ ఆశయo ఎంతో గొప్పది!.. బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి జనసైనికులతో ఘనమైన నివాళులు అర్పించారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్, పలువురు మహాత్ముల గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్లడం, భారతదేశం గర్వించదగ్గ పలువురు ప్రముఖ నాయకులను, దేశ నాయకులను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులలో జ్యోతిరావు పూలే ఒకరిని ఈ సందర్భంగా వారిని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని బండారు శ్రీనివాస్ కోరారు.