తమ్మిరెడ్డి శివశంకర్ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జ్యోతుల

పెందుర్తి నియోజకవర్గం: సబ్బవరం మండలకేంద్రంలో జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర జన్మదినోత్సవ వేడుకలలో జ్యోతుల శ్రీనివాసు పాల్గొని ముందుగా వేదికపైన ఆశీనులైన తమ్మిరెడ్డి శివశంకర్ ను పూలమాలవేసి, శాలువతోసత్కరించి, అన్నవరం సత్యదేవుని ఫోటోని జ్ఞాపకగా అందజేసి, అన్నవరం సత్యదేవుడి ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. తమ్మిరెడ్డి శివశంకర్ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుక సమావేశము నందు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ తమ్మిరెడ్డి శివశంకర్ గారు సామాజికవేత్త ని జనసేన పార్టీ సిద్ధాంతకర్తని, విద్యావేత్త.తమ్మిరెడ్డి శివశంకర్ గారు తను చేస్తున్న ఉద్యోగ 7 సంవత్సరాలు పదవీకాలం ఉన్నా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి తను నిర్వహిస్తున్న ఐఏఎస్ క్యాడర్ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి పార్టీ సిద్ధాంతాల పట్ల తమ ఉన్నా ఇష్టతను చెప్పి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా తెలియజేసి, జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ స్థాపించినప్పుడు నుంచి అన్ని స్థాయిలలోనూ తమ్మిరెడ్డి శివశంకర్ పనిచేస్తున్నారని ఆయన లాంటి విద్యావేత్త రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపున శాసనసభలు కెళ్ళి శాసనాలు తయారు చేయడంలో తన భాగ్యస్వామ్యం కూడా ఉంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుందని జ్యోతుల శ్రీనివాసు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు వెంట జనసేన నాయకులు మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, ప్రత్తిపాడు జనసేన నాయకులు మేకల కృష్ణ, ఈర్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.