నిరుపేద వికలాంగుడికి సహాయము అందించిన జ్యోతుల శ్రీనివాసు

కాకినాడజిల్లా, పిఠాపురంనియోజవర్గం: గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామానికి చెందిన అరట్లకట్ల సుబ్బారావు,అప్పలకొండ దంపతుల కుమారుడు అరట్లకట్ల స్వామి జన్మతః వికలాంగుడుఅరట్లకట్ల స్వామి తన 2 కాళ్ళు చచ్చుపడిపోవడం కారణంగా నడవలేని స్థితిలో ఊతకర్రలు ద్వారా నడుస్తూ ఉంటాడు. అతని ఊతకర్రలు సక్రమంగా పనిచేయకపోవడంతో పడిపోవడం వల్లన తీవ్రమైన గాయాలు అయి గత సంవత్సరం నుంచి కూడా తీవ్రమైన ఇబ్బందిపడుతున్నాడు. అటువంటి తరుణంలో సాయిప్రియ సేవాసమితి కార్యకర్త మంతెన గణేషు కి తన ఊతకర్రలు సమస్యను అరట్లకట్ల స్వామి తెలియజేయగా మంతెన గణేషు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసుకు తెలియగా తెలియజేయగా వెంటనే స్పందించి శుక్రవారం దుర్గాడ గ్రామంలో గల అరట్లకట్ల స్వామి ఇంటికి వెళ్లి జ్యోతుల శ్రీనువాసు జనసేన నాయకులు మరియు దుర్గాడ గ్రామ జెడ్ పి హెచ్ స్కూల్ పేరెంట్ కమిటీ చైర్మన్ కందా శ్రీనివాస్, జనసేన నాయకులు గొల్లపల్లి గంగబాబు, శాఖ సురేష్, ఇంటి వీరబాబు, గొలనియోజకవర్గంలతో కలిసి వెళ్ళి అరట్లకట్ల స్వామిని వారి కుటుంబ ఆర్దికపరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు‌. అరట్లకట్ల స్వామి జ్యోతుల శ్రీనివాసుతో తన కుటుంబ పరిస్దితులను వివర్తిస్తూ తన తండ్రి అయిన అట్లకట్ల సుబ్బారావు దీర్ఘకాలికంగా పక్షవాతంవ్యాధితో మంచంపైనే వైద్యసేవలుతీసుకొంటున్నారని, మేము చాలా బీదవారిమని తెలియజేయగా వారికి జ్యోతుల శ్రీనివాసు ఊతకర్రలను అందిస్తూ, అట్లకట్ల సుబ్బారావు వైద్యఖర్చులు నిమిత్తం రూ:3000/-అక్షరాల (మూడు వేల రూపాయలు) డబ్బులు వారికి అందించారు. అరట్లకట్ల స్వామితో జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ మీ కుటుంబ నిత్యావసరవస్తువులు అవసరమైనప్పుడు నాకు ప్రత్యేకంగా పోన్ లో విషయం తెలియజేస్తే నేను తక్షణం సహయం అందిస్తాని అందించారు. అరట్లకట్ల స్వామికి హామి ఇచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా తెలియజేస్తే వారికి తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటానని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, గొల్లపల్లి గంగబాబు, శాఖ సురేష్, కుమ్మరి గంగేశ్వరుడు, యదాల అప్పారావు, గంపల శివ, కుర్రు అప్పారావు, చేశెట్టి భద్రం, ఆకుల వెంకటస్వామి, మంతెన గణేష్, మేడిబోయిన హరికృష్ణ, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.