నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం అందించాలని జ్యోతుల శ్రీనివాసు డిమాండ్

పిఠాపురం, మిచౌంగ్ తుఫాన్ కారణంగా పిఠాపురం నియోజకవర్గం నందు గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాకొత్తపల్లి మండలాల్లో అన్ని గ్రామాలలో మెరక, పల్లపు భూములలో గల పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని ఇటువంటి సమయంలోనే రాష్ట్రప్రభుత్వం నష్టపోయిన రైతులకు పల్లపు పంటభూముల పంటలకు 30,000/-రూపాయలు. మెర పంటభూముల పంటలైన పత్తి, అరటి, మిర్చి వంటి పంటలకు 40,000/- రూపాయలు చొప్పున రాష్ట్రప్రభుత్వం తక్షణ రైతులకు పంటనష్టపరిహారంగా అందజేసి మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకొవాలని, ఇటువంటి విపత్తు సమయంలో రాష్ట్రప్రభుత్వం సహాయం అందించకపోతే రైతు మరింత పేదవాడిగా మారిపోతాడని జ్యోతుల శ్రీనివాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం నందు మిచౌంగ్ తుఫాన్ కారణం పంటలు మునిగిపోయిన వ్యవసాయక్షేత్రాలలో నీట మునిగిన పంటలను దుర్గాడ గ్రామ రైతులు, జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అరటి, మిర్చి, ప్రత్తి, వరి, దొండ, చిక్కుడు, బెండ తొటలను పరిశీలించారు. నష్టపోయిన పంటలకు జరిగిన నష్టాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు పెట్టుబడి పూర్తిగా పెట్టి పంటఅనుభవానికి వస్తుందన్న సమయంలో అకాలంగా సంభవించిన మిచౌంగ్ తుఫాన్ వలన కురిసిన భారీ వర్షాలు కారణంగా పంటలు నీట మునిగి, ఈదురుగాలుల కారణంగా భారీనష్టం వాటిందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు‌. సదరు‌ పంటలను కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ ఆర్డిఓ, అదే విధంగా గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల తాసిల్దార్లు పంటలకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంవనా వేసి రాష్ట్రప్రభుత్వానికి నివేదికలను పంపించి నష్టపోయిన రైతకు తక్షణం తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వానికి చెప్పాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు వెంట మేడిబోయిన సత్యనారాయణ, జీలకర కృష్ణ, జ్యోతుల రాము, ఇంటి నాగేశ్వరావు, కోరకుప్ప కామరాజు, ఇంటి వీరబాబు, మేడిబోయిన శ్రీను, అయినవిల్లి శ్రీను, శాఖ సురేష్, వెలుగుల వాసు, జ్యోతుల నానాజీ, జ్యోతుల చిన్నయ్య, ఆకుల వెంకటసాయి, జ్యోతుల శివ, రావుల రమణ, పొత్తుల అప్పారావు, విపర్తి శ్రీను, శివకోటి రమణ, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.