నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, తాటిపర్తి గ్రామానికి చెందిన జల్లిగంపల తాతారావు వ్యవసాయకూలీ. జల్లిగంపల తాతారావు ఒక సంవత్సరం క్రితం వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. జల్లిగంపల తాతారావు కుటుంబం చాలా బీద కుటుంబం. జల్లిగంపల తాతారావు గారు వ్యవసాయ కూలీ జీవనోపాధి ద్వారా వీరి కుటుంబం గడుస్తూ ఉండేది. జల్లిగంపల తాతారావు కుమారుడు జల్లిగంపల అపర్ణనాగేషు వికలాంగుడు కావడం, జల్లిగంపల తాతారావు బార్య జల్లిగంపల నాగలక్ష్మి గృహిణి కావడం, జల్లిగంపల తాతారావు కుమార్తె ఏసమ్మ 15 సంవత్సరాల వయసు కలిగి ఉండడంతో జల్లిగంపల తాతారావు మరణం వీరిని మరింత పేదవారీగా మార్చింది. తాటిపర్తి జనసైనికులు ఫోన్ ద్వారా జల్లిగంపల తాతారావు కుటుంబమునకు జరిగిన అన్యాయంను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు తెలియజేశారు. ఫోను ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మంగళవారం నాడు తాటిపర్తి గ్రామం నందుగా జల్లిగంపల తాతారావు అద్దెనివాసంనకు వెళ్లి జల్లిగంపల తాతారావు బార్య జల్లిగంపల నాగలక్ష్మి, కుమార్తె జల్లిగంపల ఏసమ్మలను కలిసి వారి కుటుంబ పరిస్థితిని ఆరా తీసి వారికి కిరాణా సామాన్లు నగదు మరియు 25 కేజీల బియ్యం వారికి సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి జనసేన నాయకులు గారపాట చంటిబాబు, గాడిదల బుజ్జి, పాశం గోవిందు, శీలం శ్రీనివాస్, వీర్నేడి దివాణం, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, బండి శివ, కొలా నాని తదితరులు ఉన్నారు.