డాక్టర్ పిల్లా శ్రీధర్ పాదయాత్రకు మద్దతు తెలిపిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం రూరల్ మండలం, కందరాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే కొరికతో పిఠాపురం పాదగయ నుండి చెదలవాడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా శనివారం డాక్టరు పిల్లా‌ శ్రీధర్ చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఎఫ్.కే పాలెం కూడలి వద్ద సాదరంగా ఆహ్వానం పలికి ముందుగా పువ్వలమాల వేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ జనసేన పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలకు నా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. మిత్రుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు చేస్తూన్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. అనంతరం జరిగిన పాదయాత్రలో విరవాడ గ్రామం వరకు జ్యోతుల శ్రీనివాసు డాక్టరు పిల్లా శ్రీధర్ వెంట పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు వెంట జనసేన నాయకులు మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతరాంబాబు, నాగబొయిన వీరబాబు, కొలా నాని,
జ్యోతుల వాసు, సాదనాల చంటిరాము, కీర్తి నాని, మేడిబోయిన హరికృష్ణ తదితరులు ఉన్నారు.