కడపజిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

కడపజిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన త్రిసభ్యకమిటీ సభ్యులైన రాష్ట్రకార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరంచాన్, కడప నియోజకవర్గ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మరియు కోడూరు నియోజకవర్గ నాయకులు రాష్ట్రకార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాయచోటి ఇంచార్జ్ హసన్ బాషా కోడూరు ఇంచార్జ్ బోనాసి వెంకటసుబ్బయ్య మరియు జనసైనికులు వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖరంచాన్ కార్యకర్తలను ఉద్దేశించి మొదటగా జనసేన పార్టీ లోని వీరమహిళలకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ప్రస్తుతం గత వారం రోజులుగా జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ లింకులు తీసుకుని సభ్యత్వాలను ఘనంగా పూర్తి చేసిన కార్యకర్తలను నాయకులను అభినందించారు. రానున్న మార్చ్14 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతూ కార్యక్రమానికి హాజరవ్వబోయే జనసైనికులకు, వీరమహిళలకు నాయకులకు దిశానిర్దేశం చేసారు.