అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

భారత దేశ 11 వ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డా. ఏ.పి. జె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి. ఈ సదర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు దేశానికి చేసిన సేవల గురించి తెలియజేసి.. అదేవిధంగా జనసైనికులు అందరు అబ్దుల్ కలాం గారి భావజాలాన్ని అనుసరించాలని.. మనవంతుగా దేశ సేవలో పాలు పంచుకోవాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కిరణ్, అయూబ్, మణికంఠ, రసూల్, నాగార్జున, అజయ్ పాల్గొన్నారు.